అమెరికా వీసా టెన్షన్.. హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య
Advertisement
- ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు
- రెండోసారి వీసా కోసం దరఖాస్తు చేసి ఫలితం కోసం ఎదురుచూపు
- వస్తుందో.. రాదోననే ఆందోళనతో ఉరేసుకున్న యువకుడు
Advertisement
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా వస్తుందో రాదోనన్న ఆందోళనతో రోహిత్ రెడ్డి (26) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలన్న తన కల నెరవేరదేమోనన్న భయంతో శుక్రవారం ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అత్తాపూర్‌లోని తేజస్విని నగర్‌కు చెందిన చంద్రారెడ్డి, ఇందిర దంపతుల కుమారుడు రోహిత్ రెడ్డి. బీటెక్ పూర్తి చేసిన రోహిత్, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గతంలో ఒకసారి వీసా కోసం దరఖాస్తు చేయగా అది తిరస్కరణకు గురైంది. దీంతో ఇటీవల రెండోసారి దరఖాస్తు చేసి, ఫలితం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈసారైనా వీసా వస్తుందా? లేదా? అన్న దానిపై కొన్ని రోజులుగా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి తిరిగివచ్చిన కుటుంబ సభ్యులు గదిలో వేలాడుతున్న రోహిత్‌ను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీసా గురించిన ఆందోళనే రోహిత్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు. దర్యాప్తు పూర్తయితే మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.